Monday, June 2, 2025

గుంతకల్ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షులు గా… దేవరపల్లి నక్కా నారప్ప నియామకం…

గుంతకల్ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షులు గా… దేవరపల్లి నక్కా నారప్ప నియామకం…
మన గుంతకల్ న్యూస్
గుంతకల్,జనవరి 23,న్యూస్: అనంతపురం జిల్లా గుంతకల్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షులు గా పామిడి మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన నక్కా నారప్ప ని ఎంపిక చేసినట్లు వైసిపి కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అనంతరం నక్కా నారప్ప మాట్లాడుతూ.. తన పై విశ్వాసంతో తనకు ఇచ్చిన బాధ్య తలను సమర్థవంతంగా నిర్వ ర్తిస్తానన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరి ష్కారానికి ప్రభుత్వం పై రాజీలేని పోరాటాలు చేస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గడుతూ..చంద్రబాబునాయు డు విద్యార్థులు, నిరుద్యోగులకు చేసిన మోసాన్ని వివరిస్తూ.. క్షేత్రస్థాయిలో యువజన విభాగాన్ని బలోపేతం చేసి.. వైఎస్ జగన్ ను సిఎం చేయడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. ఈ సందర్భంగా మాజి సీఎం జగన్ మోహన్ రెడ్డి కి అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి కి గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి కి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నైరుతి రెడ్డి కి మంజునాథ్ రెడ్డి కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular